
హుజూర్ నగర్, వెలుగు : కాంగ్రెస్ కు కార్యకర్తలే బలమని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్ పెద్దకర్మ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై శ్రావణ్కుమార్ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ శ్రావణ్ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోట అని అన్నారు. మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఆయన పిల్లల చదువు పూర్తయ్యేవరకు తను బాధ్యత తీసుకుంటాని హామీ ఇచ్చారు. శ్రావణ్ భార్య సత్యవతి, పిల్లలను ఓదార్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జునరావు, కోడి ఉపేందర్ యాదవ్, నాయకులు ఉన్నారు.